జీనోమ్ గురించి వివరణ తెలుగులో

జీనోమ్ అనేది ఒక జీవిలో DNA రూపంలో ఉండే పూర్తి జన్యు సూచనల సమితి, అన్ని జన్యువులు కూడిక.

20 జనవరి, 2025
జీనోమ్ గురించి వివరణ తెలుగులో | Genome
జీనోమ్ అనేది ఒక జీవిలో DNA రూపంలో ఉండే అన్ని జన్యువులు కూడిక.

ఒక జీవిలో డిఎన్ఎ (DNA, డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్) రూపంలో ఎన్‌కోడ్ చేయబడిన జన్యుసూచనల సముదాయాన్ని జీనోమ్ అంటారు. ఇందులో ఒక జీవి యొక్క అభివృద్ధి, పెరుగుదల, పునరుత్పత్తి, పనితీరుకు అవసరమైన మొత్తం సమాచారం ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, జీనోమ్ అనేది బ్లూప్రింట్ వంటిది. ఒక జీవిని తయారు చేయడానికి సూచనలతో కూడిన రెసిపీ పుస్తకంలాంటిది.

జీనోమ్‌లో ఇవి ఉంటాయి:

జన్యువుల కోడ్: డిఎన్ఎ అణువులను రూపొందించే న్యూక్లియోటైడ్‌ల (A, C, G, T) క్రమం (sequence).

జన్యువులు: కణాలలో నిర్దిష్ట విధులను నిర్వర్తించే ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లను తయారుచేయడానికి కావాల్సిన సూచనలు ఉండే నిర్దిష్టమైన డిఎన్ఎ క్రమాలు, జన్యువులు.

నియంత్రణ మూలకాలు: జన్యు వ్యక్తీకరణను నియంత్రించే ప్రాంతాలు.

నాన్-కోడింగ్ ప్రాంతాలు: ప్రొటీన్‌లను కోడ్ చేయని డిఎన్ఎ ప్రాంతాలు. ఇవి కోడ్ చేయనప్పటికీ జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తాయి.

జన్యువులు సాధారణంగా యూకారియోటిక్ కణాల కేంద్రకంలో (మానవుల వలె) లేదా ప్రొకార్యోటిక్ కణాల సైటోప్లాజంలో (బ్యాక్టీరియా వలె) నిల్వ చేయబడుతుంది. జన్యువులు మరియు వాటి విధుల అధ్యయనాన్ని జెనోమిక్స్ అని పిలుస్తారు. ఈ అధ్యయనాలు జీవశాస్త్రం, వ్యాధి నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన వైద్యం (personalized medicine) వంటి ఇతర రంగాల పురోగతికి తోడ్పడుతున్నాయి.

జీనోమ్ గురించి ఇంకొన్ని ముఖ్యమైన శాస్త్రీయ వాస్తవాలు:

జీనోమ్ పరిమాణాలలో విస్తృతమైన తేడాలు ఉంటాయి: వేర్వేరు జంతువుల్లో జీనోమ్ పరిమాణం వేర్వేరుగా ఉంటుంది.

మానవుల్లో 3 బిలియన్ మూల జతలు ఉంటాయి: మానవ జీనోమ్‌లో సుమారుగా 3 వందల కోట్ల మూల జతలు ఉంటాయి ఉదా: G-C, A-T ఇవి మూల జతలు. ఈ మూల జతలు అన్నీ 23 క్రోమోజోమ్ జతలుగా విభజించబడి (అంటే 23 వేరువేరు కుప్పలుగా) ఉంటాయి.

జన్యువులు స్థిరంగా ఉండవు: ఉత్పరివర్తనలు (mutations), చొప్పింపులు, తొలగింపులు, అలాగే ఇతర యంత్రాంగాల ద్వారా జన్యువులు మారవచ్చు, వీటి ఫలితంగా పరిణామాత్మక అనుసరణలు లేదా వ్యాధులు సంభవించవచ్చు.

జన్యువైవిధ్యం సర్వసాధారణం: సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజాలు (SNPలు), చొప్పింపులు, తొలగింపులు, అచ్చు సంఖ్యలో తేడాలతో సహా ఇతర జన్యు వైవిధ్యాలు మానవ జీనోమ్ అంతటా ఉంటాయి. వీటి కారణంగా వ్యాధి గ్రహణశీలతలో, చికిత్సకు స్పందించటంలో మనిషి మనిషికి వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి.

జన్యుసంబంధమైన డేటాతో ఆరోగ్య ప్రమాదాలను అంచనావేయగలం: జన్యుసంబంధమైన డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు గుండె జబ్బులు, క్యాన్సర్ లేదా ఇతర వారసత్వ రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించగలరు. దీని ద్వారా ముందుజాగ్రత్తలు తీసుకోవడం, వ్యక్తిగతీకరించిన వైద్యం అందించడం సాధ్యమవుతుంది.

టూకీగా, జీనోమ్‌లు సంక్లిష్ట రసాయనాలు. వీటి పరిమాణం, జన్యు సాంద్రతలో చాలా తేడాలు ఉంటాయి. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో జీనోమ్‌లోని అన్ని ప్రాంతాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అదనంగా ఉత్పరివర్తనలు, చొప్పింపులు వంటి జన్యు మార్పులు, పరిణామాత్మక అనుసరణలకు లేదా వ్యాధులకు దారితీయవచ్చు. అయితే జన్యుసంబందిత డేటాని విశ్లేషించి ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేయగలం. వ్యక్తిగతీకరించిన వైద్య విధానాలను రూపొందించగలం.

సంబంధిత పదాలు

Supercoiling

సూపర్ కాయిలింగ్

సూపర్‌కాయిలింగ్ అనేది DNA తంతువులను మరింత కాంపాక్ట్ స్ట్రక్చర్‌గా అతిగా లేదా అండర్‌వైండింగ్ చేయడాన్ని సూచిస్తుంది.
Alternative splicing

ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్

ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ఒక జన్యువును బహుళ ప్రోటీన్‌ల కోసం కోడ్ చేయడానికి అనుమతించే ఒక అద్భుతమైన ప్రక్రియ.
Metabolism

జీవక్రియ

జీవక్రియ అనేది జీవితాన్ని నిలబెట్టే అన్ని రసాయన ప్రతిచర్యల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
Phytoplankton

ఫైటోప్లాంక్టన్

ఫైటోప్లాంక్టన్ అనేది సముద్రపు ఆహార వెబ్‌కు ఆధారమైన సూక్ష్మ సముద్ర మొక్కలు.
Cancer

క్యాన్సర్

క్యాన్సర్ అనేది అనియంత్రిత కణాల పెరుగుదల మరియు చుట్టుపక్కల కణజాలాలపై దాడి చేసే సామర్థ్యం ద్వారా వర్గీకరించబడిన వ్యాధి.
Proteomics

ప్రోటియోమిక్స్

ప్రోటియోమిక్స్ అనేది జీవ వ్యవస్థలో ప్రోటీన్ల నిర్మాణం, పనితీరు మరియు పరస్పర చర్యల అధ్యయనం.
Hypothermia

అల్పోష్ణస్థితి

అల్పోష్ణస్థితి చాలా కాలం పాటు చల్లని ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల ఏర్పడే సాధారణ-తక్కువ శరీర ఉష్ణోగ్రతతో కూడిన స్థితి.
Nucleotide

న్యూక్లియోటైడ్

న్యూక్లియోటైడ్ అనేది DNA మరియు RNA యొక్క బిల్డింగ్ బ్లాక్, ఇందులో చక్కెర, ఫాస్ఫేట్ సమూహం మరియు నత్రజని ఆధారం ఉంటాయి.
Ribosome

రైబోజోమ్

రైబోజోమ్ ప్రోటీన్ సంశ్లేషణకు బాధ్యత వహించే సెల్యులార్ నిర్మాణం.
Senescence

సెనెసెన్స్

సెనెసెన్స్ జీవులలో సంభవించే వృద్ధాప్యం లేదా క్షీణత ప్రక్రియ. శారీరక పనితీరులో క్షీణతకు దారితీస్తుంది.