దాపువేడి గురించి వివరణ తెలుగులో

దాపువేడి లేదా గుప్తోష్ణం (latent heat) అనేది మరగటం వంటి ఉష్ణోగ్రత-మారని ప్రక్రియలలో పాల్గొనే శక్తి.

22 మార్చి, 2025
దాపువేడి గురించి వివరణ తెలుగులో | Latent Heat
దాపువేడి లేదా గుప్తోష్ణం (latent heat) అనేది మరగటం వంటి ఉష్ణోగ్రత-మారని ప్రక్రియలలో పాల్గొనే శక్తి.

దాపువేడి లేదా గుప్తోష్ణం (latent heat) అనేది గడ్డకట్టడం లేదా మరగటం వంటి ఉష్ణోగ్రత-మారని ప్రక్రియలలో ఒక వస్తువు, ఒక థర్మోడైనమిక్ వ్యవస్థ ద్వారా విడుదలయ్యే లేదా గ్రహించబడే శక్తి.

దాపువేడిని ఒక దాగిన శక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వేడి ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను లేదా పీడనాన్ని (pressure) మార్చకుండా, ఆ పదార్థం యొక్క స్థితి మార్పుకు కారణమవుతుంది.

మరిగేటప్పుడు ఏం జరుగుతుంది? ఉష్ణోగ్రత ఎందుకు మారదు?

ఓ గ్లాసుడు నీటిని పొయ్య మీద వేడి చేస్తే, క్రమంగా దాని ఉష్ణోగ్రత పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నీటి ఉష్ణోగ్రత పెరిగి పెరిగి, మరిగే దశను చేరేసరికి ఒక్కసారిగా దాని ఉష్ణోగ్రతలోని పెరుగుదల ఆగిపోతుంది. అలా ఆగిపోయిన తరుణంలోనే ద్రవ్యరూపంలో ఉన్న నీరంతా ఆవిరిగా మారుతుంది. ఉన్న నీరంతా ఆవిరిగా మారేంత వరకూ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.

నీరు కావచ్చు, మరే వస్తువైనా సరే, లెక్కకు అందనన్ని అణువులతో ఏర్పడివుంటుంది. అయితే ఈ అణువుల సర్దుబాటు ఎలా ఉంటుందంటే: వాయువులు, ద్రవ్యాలు, గడ్డలలో (ఘనపదార్ధాలు) అణువు అణువుకూ నడుమనున్న దూరాలు, ఖాళీచోటులు వరుసగా తగ్గుతూవస్తాయి. ఈ రకమైన సర్దుబాటు ఉండడానికి, ఆయా పదార్థాల్లోని చెరి రెండు అణువులకూ మధ్యనున్న ఆకర్షిత ఇంటర్మాలిక్యులర్ ఫోర్సు (intermolecular force) కారణం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సుకూ అణువుల మధ్యనున్న దూరానికీ మారుచెంతం (inverse relation) ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే, ఇంకోటి తగ్గుతుందన్నమాట.

వేడి అనేది శక్తికి ఒకానొక రూపం. ఎప్పుడైతే నీటిని వేడి చేస్తామో, నీటి అణువులు ఆ వేడి నుంచి శక్తిని పుచ్చుకొని, తమ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సుకు ఎదురేకగా కంపిస్తూ, కదులుతూ, వాటి మధ్యనున్న దూరాన్ని పెంచుకుంటూపోతాయి. ఇలా జరిగేటప్పుడు వాటి అంతర్గత శక్తి (internal energy) పెరుగుతూవుంటుంది. ఈ పెరుగుదలనే మనం నీటి ఉష్ణోగ్రత రూపంలో కొలుస్తాము. ఉష్ణోగ్రతను పెంచే ఈ రకపు వేడిని తెలియువేడి (sensible heat) అంటారు.

అలా, అణువుల కంపనం, వేగం పెరుగుతూ పెరుగుతూ, ఒకదశలో వాటి మధ్యనున్న బంధనాలను తెంచుకునేందుకు దాపువేడిని పుచ్చుకుంటాయి. ఆ దశనే బాయిలింగ్ పాయింట్ (boiling point) అంటారు. అయితే ఈ దాపువేడి అనేది అణువుల యొక్క అంతర్గత శక్తిని గానీ, వాటి కంపనాలను, వేగాన్ని గాని ప్రభావితం చేయదు. కనుక ఈ దశలో ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పూ కనపడదు.

టూకీగా, మనం పొయ్య గుండా ఇస్తున్న పూర్తి వేడి (total heat) తెలియువేడి (sensible heat) మరియు దాపువేడి (latent heat) అనబడే రెండు చీలికలను పొందుతుంది. అణువులు కంపించేటప్పుడు, వేగాన్ని పెంచుకునేటప్పుడు మొదటి రకపు వేడినీ, అవి వాటి బంధనాలను తెంచుకునేటప్పుడు రెండవ రకపు వేడినీ వేర్వేరుగా పుచ్చుకుంటాయి. అయితే కంపించడానికి పనికొచ్చే తెలియువేడి మాత్రమే ఉష్ణోగ్రతలోని మార్పును కలిగిస్తుంది. దాపువేడి ఆ మార్పును కలిగించదు. దీన్ని పోలీనట్లుగానే నీరు గడ్డకట్టే తరుణంలో కూడా జరుగుతుంది. కాకపోతే, ఇక్కడ అణువులు వేడిని తీసుకుంటే, అక్కడ అణువులు వేడిని వాతావరణంలోకి విడిచిపెడతాయి. అంతే తేడా. విడిచిపెట్టేటప్పుడు కూడా వేడిని మళ్ళీ రెండు చీలికలుగా వేర్వేరు దశలలో విడుదల చేయడం జరుగుతుంది. కనుక, గడ్డకట్టే దశను చేరేంతవరకూ నీటి ఉష్ణోగ్రత తగ్గుతూవస్తుంది. కానీ, గడ్డకట్టే తరుణంలో విడిచే దాపువేడి ఉష్ణోగ్రతలో మార్పును కలిగించదు.

సంబంధిత పదాలు

Radiotherapy

రేడియోథెరపీ

రేడియోథెరపీ కణాలు నాశనం చేయడానికి లేదా కుదించడానికి అధిక-శక్తి రేడియేషన్‌ను ఉపయోగించే చికిత్స యొక్క ఒక రూపం.
Quantum Mechanics

క్వాంటం మెకానిక్స్

క్వాంటం మెకానిక్స్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక శాఖ. అతి చిన్న ప్రమాణాల వద్ద కణాల ప్రవర్తనను వివరిస్తుంది.
Relativity

సాపేక్షత

సాపేక్షత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అభివృద్ధి చేసిన శాస్త్రీయ సిద్ధాంతం. ఇది స్థలం, సమయం మధ్య సంబంధాన్ని వివరిస్తుంది.
Thermodynamics

థర్మోడైనమిక్స్

థర్మోడైనమిక్స్ అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క శాఖ, ఇది వేడి, శక్తి మరియు పని మధ్య సంబంధంతో వ్యవహరిస్తుంది.
Multiverse

మల్టీవర్స్

మల్టీవర్స్ అనేది బహుళ విశ్వాల యొక్క సైద్ధాంతిక సమూహం మరియు వాటిని కలిగి ఉన్న మల్టీవర్స్.
Renewable Energy

పునరుత్పాదక శక్తి

పునరుత్పాదక శక్తి సౌర, గాలి, హైడ్రో లేదా భూఉష్ణ శక్తి వంటి సహజంగా లేదా వేగంగా తిరిగి నింపబడే శక్తి వనరులను సూచిస్తుంది.
Disorder

రుగ్మత

విజ్ఞాన శాస్త్రంలో రుగ్మత అనేది వ్యవస్థ లేదా నిర్మాణంలో క్రమరాహిత్యం లేదా సంస్థ లేకపోవడాన్ని సూచిస్తుంది.
Astrophysics

ఆస్ట్రోఫిజిక్స్

ఖగోళ భౌతిక శాస్త్రం అనేది ఖగోళ వస్తువులు మరియు వాటి దృగ్విషయాల అధ్యయనంతో వ్యవహరించే విజ్ఞాన శాఖ.
Electromagnetism

విద్యుదయస్కాంతత్వం

విద్యుదయస్కాంతత్వం అనేది భౌతిక శాస్త్రం యొక్క శాఖ, ఇది విద్యుత్ ఛార్జీలు మరియు ప్రవాహాల పరస్పర చర్యతో వ్యవహరిస్తుంది.
Absolute Zero

సంపూర్ణ సున్నా (అబ్సొల్యూట్ జీరో)

సంపూర్ణ సున్నా అనేది విశ్వంలో సాధ్యమైనంత తక్కువ ఉష్ణోగ్రత. ఇది 0.00 K లేదా −273.15 °Cకి సమానం.