ఉపయోగ నిబంధనలు మరియు షరతులు

మా ఈ "నిబంధనలు మరియు షరతుల" పత్రం మీరు మా వెబ్‌సైట్ (telugu.science), అనుబంధిత ఉత్పత్తులు మరియు సేవలను ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తుంది.

16 అక్టోబర్ 2024న 21:56కి నవీకరించబడింది

telugu.scienceను (ఇకనుండి "మేము", "మా", లేదా "ఈ సైట్") మరియు మా సేవల వినియోగాన్ని ఈ కింది నిబంధనలు, షరతులు నియంత్రిస్తాయి.

మా సేవలను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ వాడుక నిబంధనలకు, షరతులకు కట్టుబడి ఉంటామని అంగీకరిస్తున్నారు. మీరు ఈ నిబంధనలలో దేనితోనైనా అంగీకరించకపోతే దయచేసి మా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం మానుకోండి.

కంటెంట్, సమాచారం

ఖచ్చితత్వంపై మాకున్న నిబద్ధతకు శాస్త్రవేత్తలుగా మేము గర్వపడుతున్నాము. మేము ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటాము. అయితే సైన్స్ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందువల్ల మేము కంటెంట్ యొక్క పూర్తి ఖచ్చితత్వానికి, సంపూర్ణతకు లేదా విశ్వసనీయతకు హామీ ఇవ్వలేము. ఇతర మూలాధారాలతో ఎల్లప్పుడూ క్రాస్-రిఫరెన్స్ చేసుకోండి.

మా సేవల ముఖ్య ఉద్దేశం మీకు సమాచార అందించండం. మీరు మా సమాచారాన్ని నలుగురితో పంచుకోవచ్చు, చర్చించొచ్చు. అయితే దానికి మమ్మల్ని సరైన తీరులో ప్రస్తావించి, మా సమాచారాన్ని మాకు ఆపాదించాలి. మా నుంచి స్పష్టమైన సమ్మతి లేకుండా వాణిజ్యపరమైన వాడుక, పునరుత్పత్తి, లేదా పంపిణీ చేయకూడదు.

ఈ గూటి (site) లోని సమాచారం విద్య కోసం మాత్రమే అందించబడుతుంది. ఇది మా శాస్త్రవేత్తలు, నిపుణుల ప్యానెల్ ద్వారా సమీక్షించబడింది, ధృవీకరించబడింది, వాస్తవంగా తనిఖీ చేయబడింది. ఈ వెబ్‌సైట్‌లో చేసిన ప్రకటనలు ఏవైనా ఒక వ్యాధి లేదా అనారోగ్యాన్ని నిర్ధారించడానికి, నయం చేయడానికి, చికిత్స చేయడానికి లేదా నిరోధించడానికి ఉద్దేశించినవి కావు. వైద్యం, ఆరోగ్యం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ వైద్యుడిని లేదా ఇతర అర్హత కలిగిన వైద్య సిబ్బందిని సంప్రదించండి.

మీరు తీసుకునే నిర్ణయాలకు, మీ చర్యలకు తుది బాధ్యత మీదేనని మీరు గుర్తుంచుకోవాలి. ఏదైనా సందర్భంలో చట్టపరమైన, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి లేదా బాధ్యతల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీరు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవాలి.

మా సేవల ఉపయోగించడం లేదా ఉపయోగించడంలో అసమర్థత కారణంగా ఉత్పన్నమయ్యే ఏవైనా నష్టాలకు (సమాచారం లేదా డబ్బులు కోల్పోవడం, వ్యాపారంలో అంతరాయం, ఇంకా ఏమైనా) మేము ఎలాంటి బాధ్యత వహించము. అటువంటి నష్టం జరిగే అవకాశం గురించి మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా మాకు లేదా మా అధీకృత ప్రతినిధికి తెలియచేసినప్పటికీ ఇది వర్తిస్తుంది.

అదనపు సమాచారం కోసం మా గూటిలో మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు లాంకెలు ఉండవచ్చు. మేము ఈ బయటి గూటిల్లో ఉండే కంటెంట్‌ను ఆమోదించము, నియంత్రించలేము. వాటి వ్యవహారాలకు మేము బాధ్యత వహించము. జాగ్రత్త వహించండి. వారి వాడుక నిబంధనలను, గోప్యతా విధానాలను సమీక్షించండి.

వాడుకరి ప్రవర్తన

నిర్మాణాత్మక చర్చలు, అభిప్రాయాలను మేము స్వాగతిస్తాము. అయితే, ఏ విధమైన దుర్వినియోగం, అభ్యంతరకరమైన లేదా అనుచితమైన నడవడిక సహించబడదు. ఒక శక్తివంతమైన శాస్త్రీయ సమాజాన్ని పెంపొందించడానికి గౌరవప్రదమైన సంభాషణలు కీలకం.

గోప్యతా విధానం

మా గోప్యతా విధాన పత్రం, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము, సంరక్షిస్తాము అనేది వివరిస్తుంది. మా సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు అందులో వివరించిన పద్ధతులకు సమ్మతిస్తున్నారు.

నిబంధనలకు మార్పులు

ఈ వాడుక నిబంధనలను ఎప్పుడైనా నవీకరించడానికి లేదా సవరించడానికి మాకు హక్కు ఉంది. మార్పుల కోసం క్రమానుగతంగా ఈ పేజీని తనిఖీ చేయండి. ఏవైనా మార్పులు జరిగిన తర్వాత మీరు మా సేవలను ఉపయోగించడం కొనసాగిస్తే, నవీకరించబడిన నిబంధనలకు మీరు అంగీకరించినట్టే.

యాక్సెస్ రద్దు

మీరు ఈ వాడుక నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘించినా, మరేదైనా కారణం వల్లనైనా మేము ముందస్తు నోటీసు లేకుండా మా సేవలకు మీ యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.

మా శాస్త్రీయ సంఘంలో భాగమైనందుకు ధన్యవాదాలు. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, అభ్యంతరాలు కానీ ఉంటే దయచేసి దిగువ అందించిన సంప్రదింపు సమాచారాన్ని వాడి మమ్మల్ని సంప్రదించండి.

సంప్రదింపు సమాచారం

తెలుగు సైన్స్
గండిపేట్ రోడ్, కోకాపేట్
హైదరాబాద్ 500075
ఇమెయిల్: [email protected]