ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం సరైన ఆహార విధానాలు
ఒక అధ్యయనం ప్రకారం, పండ్లు, కూరగాయలు, మరియు తక్కువ కొవ్వు పాల వల్ల ఆరోగ్యకరమైన వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఒక ఇటీవలి అధ్యయనం ఆహారపు అలవాట్లకు మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది.
అధ్యయనం లో అభిజ్ఞా, శారీరక మరియు మానసిక శ్రేయస్సుపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు.
వృద్ధుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది కాబట్టి, కేవలం వ్యాధులను నివారించడంతోపాటు సమగ్ర ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించే ఆహార విధానాలను గుర్తించడం చాలా అవసరం, అని పరిశోధన పత్రం లో రాసారు.
ఈ పరిశోధనలో 1986 నుండి 2016 వరకు జరిగిన రెండు ఆరోగ్య పరిశోధనలు నుండి సేకరించిన డేటా యొక్క సమగ్ర విశ్లేషణ ఉంది.
ఈ రెండు పరిశోధనలలో మూడు దశాబ్దాలుగా 105,000 మందికి పైగా పాల్గొనేవారిని ట్రాక్ చేసారు.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని సాధించే సంభావ్యత మరియు క్రింద ఎనిమిది విభిన్న ఆహార విధానాలకు సంబంధాన్ని నిర్ధారించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం యొక్క నిర్వచనం
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా కనీసం 70 సంవత్సరాలు జీవించడంతోపాటు అభిజ్ఞా, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని నిర్వచించారు.
అయితే, ఆ ఎనిమిది ఆహార విధానాలు ఇలా:
- ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన ఆహార సూచిక (Alternative Healthy Eating Index; AHEI)
- ప్రత్యామ్నాయ మధ్యధరా సూచిక (Alternative Mediterranean Index; aMED)
- రక్తపోటును ఆపడానికి ఆహార విధానాలు (Dietary Approaches to Stop Hypertension; DASH)
- న్యూరోడెజెనరేటివ్ ఆలస్యం కోసం మధ్యధరా-DASH ఇంటర్వెన్షన్ (Mediterranean-DASH Intervention for Neurodegenerative Delay; MIND)
- ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహారం (Healthful Plant-Based Diet; hPDI)
- ప్లానెటరీ హెల్త్ డైట్ ఇండెక్స్ (Planetary Health Diet Index; PHDI)
- అనుభవపూర్వకంగా ఇన్ఫ్లమేటరీ డైటరీ ప్యాటర్న్ (Empirically Inflammatory Dietary Pattern; EDIP)
- హైపర్‌ఇన్సులినెమియా కోసం అనుభవపూర్వక ఆహార సూచిక (Empirical Dietary Index for Hyperinsulinemia; EDIH).
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం: ముఖ్యమైన ఫలితాలు మరియు ఆహార విధానాల ర్యాంకింగ్
30 సంవత్సరాల ఫాలో-అప్ తర్వాత 9.3% మంది మాత్రమే ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని సాధించారని అధ్యయనం వెల్లడించింది.
అయినప్పటికీ, పై ఎనిమిది ఆహార విధానాలలో దేనికైనా అధికంగా కట్టుబడి ఉండటం వలన ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మరియు దాని నిర్దిష్ట రంగాలలో పెరిగిన అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా, అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం యొక్క తక్కువ అవకాశాలకు దారితీసింది.
ఆహార విధానం మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మధ్య సంబంధం యొక్క బలం మారుతూ ఉంది. ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన ఆహార సూచిక (AHEI) బలమైన అనుకూల సంబంధాన్ని చూపింది, అయితే ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహారం (hPDI) బలహీనమైన సంబంధాన్ని ప్రదర్శించింది.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై వాటి ప్రభావం ఆధారంగా మనం వాటిని ర్యాంక్ చేస్తే, అవి AHEI, EDIH, aMED, DASH, PHDI, MIND మరియు చివరగా hPDI.
వ్యక్తిగత ఆహారాలు మరియు పోషకాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా అధ్యయనం పరిశీలించింది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు, గింజలు, చిక్కుళ్ళు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం యొక్క ఎక్కువ అవకాశాలకు దారితీసింది. దీనికి విరుద్ధంగా, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, చక్కెర పానీయాలు మరియు ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యంతో విరుద్ధ సంబంధాన్ని కలిగి ఉంది.
ఆసక్తికరంగా, కొన్ని ఆహార విధానాల ప్రయోజనాలు నిర్దిష్ట ఉప సమూహాలలో మరింత స్పష్టంగా కనిపించాయి. ఉదాహరణకు, మహిళలు సాధారణంగా పురుషుల కంటే ఆహారానికి కట్టుబడి ఉండటం వల్ల ఎక్కువ సానుకూల ప్రభావాలను అనుభవించారు. అలాగే, ధూమపానం చేసేవారు మరియు 25 కంటే ఎక్కువ BMI (బాడీ మాస్ ఇండెక్స్ అంటే శరీర ద్రవ్యరాశి సూచిక) ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రయోజనాలను పొందారు. అందుకే, ఆహారం ఇతర జీవనశైలి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తుంది.
మొత్తానికి ఈ పరిశోధన ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంలో జంతు ఆధారిత ఆహారాలను మితంగా చేర్చడంతో మొక్కల ఆధారిత ఆహారాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా, AHEI ఒక సమర్థవంతమైన ఆహార విధానంగా నిలుస్తుంది. ఆరోగ్యకరమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని నిర్ధారించడంలో నిర్దిష్ట ఆహార సమూహాలు మరియు ఆహార విధానాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ ఫలితాలను భవిష్యత్తులో ఆహార మార్గదర్శకాలను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.
నేచర్ మెడిసిన్ అందించిన సమాచారం ఆధారంగా ఈ వ్యాసం వ్రాయబడింది. మీరు ఈ వార్తా కథనానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని నేచర్ మెడిసిన్ పత్రిక లో చదవవచ్చు.
సంబంధిత సైన్స్ వార్తలు

బాల్య గాయం యువతలో దీర్ఘకాలిక నొప్పితో ముడిపడి ఉంది

దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం వంటి చిన్ననాటి గాయం, యువతలో దీర్ఘకాలిక నొప్పి మరియు వైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది.

పరమాణు శిలాజాల నుండి అంతర్దృష్టులు

జెనెటిక్స్ మరియు జియాలజీ ఒక బిలియన్ సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

సంగీత భావోద్వేగాలు ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఏర్పరుస్తాయి

సంగీతం ద్వారా ప్రేరేపించబడిన వేగవంతమైన భావోద్వేగాలు ప్రత్యేకమైన మరియు శాశ్వతమైన జ్ఞాపకాలను ఏర్పరుస్తాయి.
బయో ఇంజనీర్లు మానవ కణాలతో మైక్రోబోట్లను సృష్టించారు

పరిశోధకులు ఆంత్రోబోట్లను సృష్టించారు, మానవ వాయుమార్గ కణాల నుండి తయారైన చిన్న జీవసంబంధమైన రోబోట్లు.