ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి) గురించి వివరణ తెలుగులో

ట్రాన్స్‌పోజిషన్ అంటే డీఎన్ఏ భాగాన్ని జన్యువులోని ఒక ప్రదేశం నుండి తొలగించి మరొక ప్రదేశంలోకి చొప్పించే ప్రక్రియ.

07 ఏప్రిల్, 2025
ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి) గురించి వివరణ | Transposition
ట్రాన్సపోసిషన్ (జన్యుమార్పిడి)

జన్యుమార్పిడి ప్రాథమికాలు

ట్రాన్స్‌పోజిషన్ అంటే ట్రాన్స్‌పోజబుల్ ఎలిమెంట్ (TE) లేదా ట్రాన్స్‌పోసన్ అని పిలువబడే DNA యొక్క నిర్దిష్ట భాగాన్ని జన్యువులోని ఒక ప్రదేశం నుండి తొలగించి మరొక ప్రదేశంలోకి చొప్పించే ప్రక్రియ.

దీనిని “జంపింగ్ జీన్” (jumping gene; జన్యువు దూకడం లేదా జన్యుమార్పిడి) అని కూడా పిలుస్తారు. ఈ చర్య ఒకే క్రోమోజోమ్‌లో లేదా వేరే వేరే క్రోమోజోమూల మధ్య కూడా సంభవించవచ్చు.

జన్యుమార్పిడి జన్యు పరిమాణంలో మార్పులు, జన్యు అంతరాయం, జన్యు నకిలీ మరియు కొత్త నియంత్రణ మూలకాల సృష్టికి దారితీస్తుంది. జన్యు పరిణామం మరియు వైవిధ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జన్యుమార్పిడి ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండదు. జన్యువులలో లేదా నియంత్రణ ప్రాంతాలలో ట్రాన్స్‌పోజన్‌లను చొప్పించడం వల్ల ఉత్పరివర్తనలు సంభవించవచ్చు, జన్యు పనితీరులో మార్పు వస్తుంది.

బయోటెక్నాలజీలో, జన్యు పంపిణీ మరియు ఉత్పరివర్తన అధ్యయనాలకు జన్యుమార్పిడి (ట్రాన్స్‌పోజిషన్) ఒక సాధనంగా ఉపయోగించబడుతుంది.

జన్యుమార్పిడి రకాలు

స్వయంప్రతిపత్తి లేదా అస్వయంప్రతిపత్తి

ట్రాన్స్‌పోజన్‌లు స్వయంప్రతిపత్తి కలిగి ఉండవచ్చు, అంటే అవి వాటి స్వంత మార్పిడికి అవసరమైన అన్ని ప్రోటీన్‌లను (ట్రాన్స్‌పోసేస్ వంటివి) ఎన్కోడ్ చేస్తాయి. స్వయంప్రతిపత్తి లేని ట్రాన్స్‌పోజన్‌లకు వాటి స్వంత కదలికకు జన్యువులు ఉండవు మరియు అవసరమైన ఎంజైమ్‌లను అందించడానికి జన్యువులో స్వయంప్రతిపత్తి ట్రాన్స్‌పోజన్ ఉనికిపై ఆధారపడతాయి.

రెప్లికేటివ్ లేదా నాన్-రెప్లికేటివ్

కొన్ని ట్రాన్స్‌పోజన్‌లు ప్రతిరూపణ (రెప్లికేటివ్) పద్ధతిను ఉపయోగిస్తాయి. ఇందులో ట్రాన్స్‌పోజన్ యొక్క కొత్త కాపీ లక్ష్య ప్రదేశంలో ఉత్పత్తి అవుతుంది, అసలుది అలాగే ఉంటుంది. వ్యతిరేక పద్ధతిలో (అంటే నాన్-రెప్లికేటివ్ ట్రాన్స్‌పోజిషన్‌లో) అసలు డిఎన్ఏ విభాగం యొక్క భౌతిక కదలిక ఉంటుంది.

జన్యుమార్పిడి తరగతులు

క్లాస్ I - రెట్రోట్రాన్స్‌పోజన్‌లు

ఇందులో జన్యుమార్పిడి ఆర్ఎన్ఏ (RNA) ద్వారా జరుగుతుంది. మొదలు, డిఎన్ఏ ఆర్ఎన్ఏ గ మారుతుంది. ఈ ఆర్ఎన్ఏ లక్ష్య ప్రదేశానికి చేరుకున్నాక మల్లి డిఎన్ఏ గా మారుతుంది. దీనికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేసే అనే ఒక ఎంజైమ్ అవసరం. దీనిని రెట్రో-ట్రాన్స్‌పోజిషన్ అంటారు. యూకారియోట్‌లలో రెట్రోట్రాన్స్‌పోజన్‌లు సాధారణం.

క్లాస్ II - డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు

ఇందులో జన్యుమార్పిడి నేరుగా డిఎన్ఏగా జరుగుతుంది. డిఎన్ఏ ను దాని అసలు స్థానం నుండి తొలగించి కొత్త ప్రదేశంలోకి ప్రవేశ చేయబడుతుంది. దీనిని తరచుగా “కట్ అండ్ పేస్ట్” పద్ధతి అని వర్ణిస్తారు, అయితే కొన్ని డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు రెప్లికేటివ్ పద్దితి (పైన దీని గురించి రాసాను) కూడా ఉపయోగించవచ్చు. ట్రాన్స్‌పోసేస్ ఎంజైమ్‌ల ద్వారా కదలిక సులభతరం అవుతుంది. డిఎన్ఏ ట్రాన్స్‌పోజన్‌లు ప్రొకార్యోట్‌లు మరియు యూకారియోట్‌లు రెండింటిలోనూ కనిపిస్తాయి.

సారాంశంలో, జీవశాస్త్రంలో జన్యుమార్పిడి అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ, ఇది జన్యువులోని డిఎన్ఏ విభాగాల కదలికను కలిగి ఉంటుంది. ఇది జన్యు వైవిధ్యం, జన్యు పరిణామం, పరిశోధన మరియు వైద్యంలో ఆచరణాత్మక అనువర్తనాలను కలిగి ఉండటానికి దోహదం చేస్తుంది.


ట్రాన్స్‌పోజిషన్ (జన్యుమార్పిడి) అర్థం చేసుకోవడం కష్టమైన అంశం మరియు దానిని తెలుగులో వివరించడం ఇంకా కష్టం. నేను నా వంతు ప్రయత్నం చేసాను. ఈ అద్భుతమైన సహజ ప్రక్రియ గురించి మీరు తెలుసుకోగలరని ఆశిస్తున్నాను.


సంబంధిత పదాలు

Cell cycle

కణ చక్రం

కణ చక్రం అనేది ఒక కణంలో జరిగే సంఘటనల శ్రేణిని సూచిస్తుంది, దాని ప్రతిరూపణ మరియు రెండు కుమార్తె కణాలుగా విభజించబడుతుంది.
Meiosis

మియోసిస్

మియోసిస్ ఒక రకమైన కణ విభజన. మాతృ కణం వలె సగం సంఖ్యలో క్రోమోజోమ్‌లతో జన్యుపరంగా వైవిధ్యమైన గేమేట్‌లను ఉత్పత్తి చేస్తుంది.
Tissue

కణజాలం

కణజాలం ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న కణాల సమూహాన్ని సూచిస్తుంది. ఒక జీవిలో ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహిస్తుంది.
Immunotherapy

ఇమ్యునోథెరపీ

ఇమ్యునోథెరపీ క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తిని ఉపయోగించుకునే వైద్య చికిత్స.
Microbiome

సూక్ష్మజీవి

మైక్రోబయోమ్ మానవ శరీరం నివసించే సామూహిక సూక్ష్మజీవులు మరియు వాటి జన్యు పదార్థాన్ని సూచిస్తుంది.
Endoplasmic Reticulum

ఎండోప్లాస్మిక్ రెటిక్యులం

ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ల సంశ్లేషణ, మడత మరియు రవాణాకు బాధ్యత వహించే కణంలోని పొరల నెట్‌వర్క్.
Nutrition

పోషణ

పోషకాహారం అనేది జీవులు పెరుగుదల, అభివృద్ధి మరియు మొత్తం ఆరోగ్యం యొక్క నిర్వహణ కోసం పోషకాలన అధ్యయనం.
Xylem

జిలేమ్

జిలేమ్ అనేది ఒక ప్రత్యేకమైన మొక్క కణజాలం, ఇది నీరు మరియు పోషకాలను మూలాల నుండి మిగిలిన మొక్కకు రవాణా చేస్తుంది.
Phloem

ఫ్లోయమ్

ఫ్లోయమ్ మొక్కలలోని కణజాలం, పోషకాలు, చక్కెరలు ఆకుల నుండి మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయడానికి బాధ్యత వహిస్తుంది.
Infection

ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్ అతిధేయ జీవిలో హానికరమైన సూక్ష్మజీవులు, క్రిముల దాడి, మరియు విస్తరణను సూచిస్తుంది.